| [00:10.07] |
భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన |
| [00:14.91] |
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన |
| [00:19.96] |
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే... |
| [00:24.98] |
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే... |
| [00:30.90] |
|
| [00:38.99] |
పదర పదర పదరా! |
| [00:40.97] |
నీ అడుగుకి పదును పెట్టి పదరా! |
| [00:43.00] |
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా! |
| [00:48.93] |
పదర పదర పదరా! |
| [00:50.91] |
ఈ పుడమిని అడిగిచూడు పదరా! |
| [00:52.91] |
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా! |
| [00:58.88] |
నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, |
| [01:10.00] |
ఈ పథమున మొదటడుగెయ్ రా! |
| [01:12.95] |
నీ తరమిదిరా, అనితరమిదిరా అని చాటెయ్ రా! |
| [01:17.95] |
పదర పదర పదరా! |
| [01:19.05] |
నీ అడుగికి పదును పెట్టి పదరా! |
| [01:21.95] |
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా! |
| [01:26.88] |
పదర పదర పదరా! |
| [01:29.02] |
ఈ పుడమిని అడిగిచూడు పదరా! |
| [01:31.02] |
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా! |
| [01:36.93] |
ఓ' భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన |
| [01:41.08] |
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన |
| [01:46.03] |
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే... |
| [01:50.90] |
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే... |
| [01:57.07] |
|
| [02:14.93] |
కదిలే ఈ కాలం, తన రగిలే వేదనకి, |
| [02:19.94] |
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా! |
| [02:24.99] |
పగిలే ఇల హృదయం, తన ఎదలో రోదనకి, |
| [02:29.98] |
వరమల్లే దొరికిన ఆఖరిసాయం నువ్వేరా! |
| [02:33.96] |
కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక, |
| [02:39.00] |
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా... |
| [02:44.03] |
పదర పదర పదరా! |
| [02:45.97] |
ఈ హలమును భుజముకెత్తి పదరా! |
| [02:47.96] |
ఈ నేలను ఎదకు హత్తుకుని, మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా! |
| [02:53.95] |
పదర పదర పదరా! |
| [02:55.03] |
ఈ వెలుగను పలుగు దించి పదరా! |
| [02:57.95] |
పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా! |
| [03:04.37] |
|
| [03:27.94] |
నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం, |
| [03:31.90] |
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం! |
| [03:36.96] |
నీలో ఈ జడికి, చెలరేగే అలజడికి, |
| [03:41.97] |
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం! |
| [03:46.81] |
నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక, |
| [03:50.98] |
నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా... |
| [03:55.95] |
పదర పదర పదరా! |
| [03:57.91] |
నీ గతముకు కొత్త జననమిదిరా! |
| [03:59.93] |
నీ ఎత్తుకు తగిన లోతు ఇది, తొలి పునాది గది తలుపు తెరిచి పదరా! |
| [04:05.81] |
పదర పదర పదరా! |
| [04:07.07] |
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా! |
| [04:09.99] |
నీ ఒరవడి భవిత కలల ఒడి, బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా! |
| [04:16.63] |
|
| [04:25.09] |
తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం |
| [04:29.99] |
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం |
| [04:34.02] |
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో |
| [04:39.03] |
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో... |
| [04:43.43] |
|