[00:10.07] భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన [00:14.91] ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన [00:19.96] సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే... [00:24.98] శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే... [00:30.90] [00:38.99] పదర పదర పదరా! [00:40.97] నీ అడుగుకి పదును పెట్టి పదరా! [00:43.00] ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా! [00:48.93] పదర పదర పదరా! [00:50.91] ఈ పుడమిని అడిగిచూడు పదరా! [00:52.91] ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా! [00:58.88] నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, [01:10.00] ఈ పథమున మొదటడుగెయ్ రా! [01:12.95] నీ తరమిదిరా, అనితరమిదిరా అని చాటెయ్ రా! [01:17.95] పదర పదర పదరా! [01:19.05] నీ అడుగికి పదును పెట్టి పదరా! [01:21.95] ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా! [01:26.88] పదర పదర పదరా! [01:29.02] ఈ పుడమిని అడిగిచూడు పదరా! [01:31.02] ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా! [01:36.93] ఓ' భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన [01:41.08] ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన [01:46.03] సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే... [01:50.90] శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే... [01:57.07] [02:14.93] కదిలే ఈ కాలం, తన రగిలే వేదనకి, [02:19.94] బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా! [02:24.99] పగిలే ఇల హృదయం, తన ఎదలో రోదనకి, [02:29.98] వరమల్లే దొరికిన ఆఖరిసాయం నువ్వేరా! [02:33.96] కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక, [02:39.00] విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా... [02:44.03] పదర పదర పదరా! [02:45.97] ఈ హలమును భుజముకెత్తి పదరా! [02:47.96] ఈ నేలను ఎదకు హత్తుకుని, మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా! [02:53.95] పదర పదర పదరా! [02:55.03] ఈ వెలుగను పలుగు దించి పదరా! [02:57.95] పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా! [03:04.37] [03:27.94] నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం, [03:31.90] చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం! [03:36.96] నీలో ఈ జడికి, చెలరేగే అలజడికి, [03:41.97] గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం! [03:46.81] నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక, [03:50.98] నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా... [03:55.95] పదర పదర పదరా! [03:57.91] నీ గతముకు కొత్త జననమిదిరా! [03:59.93] నీ ఎత్తుకు తగిన లోతు ఇది, తొలి పునాది గది తలుపు తెరిచి పదరా! [04:05.81] పదర పదర పదరా! [04:07.07] ప్రతొక్కరి కథవు నువ్వు కదరా! [04:09.99] నీ ఒరవడి భవిత కలల ఒడి, బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా! [04:16.63] [04:25.09] తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం [04:29.99] తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం [04:34.02] ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో [04:39.03] తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో... [04:43.43]