| [00:10.14] |
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే |
| [00:17.40] |
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే |
| [00:25.26] |
అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా |
| [00:30.39] |
పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా |
| [00:35.47] |
మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా |
| [00:40.49] |
కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా |
| [00:44.94] |
ముగింపే ఏమైనా... మధ్యలో వదలొద్దురా నీ సాధన |
| [00:55.30] |
ప్రయత్నమే మొదటి విజయం |
| [01:00.41] |
ప్రయత్నమే మన ఆయుధం |
| [01:05.39] |
ప్రయత్నమే మొదటి విజయం |
| [01:10.11] |
ప్రయత్నమే మన ఆయుధం |
| [01:15.12] |
ఓ' ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే |
| [01:20.10] |
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే |
| [01:26.00] |
|
| [01:40.43] |
వెళ్ళే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా |
| [01:45.25] |
అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి |
| [01:50.10] |
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా |
| [01:54.92] |
అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి |
| [01:59.53] |
అడుగంటూ వేసాక... ఆగకుండా సాగాలిరా నీ సాధన |
| [02:10.35] |
ప్రయత్నమే మొదటి విజయం |
| [02:15.43] |
ప్రయత్నమే మన ఆయుధం |
| [02:20.36] |
ప్రయత్నమే మొదటి విజయం |
| [02:25.40] |
ప్రయత్నమే మన ఆయుధం |
| [02:30.69] |
ఓ' ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే |
| [02:37.75] |
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే |
| [02:45.78] |
|