[00:10.14] ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే [00:17.40] మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే [00:25.26] అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా [00:30.39] పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా [00:35.47] మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా [00:40.49] కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా [00:44.94] ముగింపే ఏమైనా... మధ్యలో వదలొద్దురా నీ సాధన [00:55.30] ప్రయత్నమే మొదటి విజయం [01:00.41] ప్రయత్నమే మన ఆయుధం [01:05.39] ప్రయత్నమే మొదటి విజయం [01:10.11] ప్రయత్నమే మన ఆయుధం [01:15.12] ఓ' ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే [01:20.10] మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే [01:26.00] [01:40.43] వెళ్ళే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా [01:45.25] అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి [01:50.10] చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా [01:54.92] అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి [01:59.53] అడుగంటూ వేసాక... ఆగకుండా సాగాలిరా నీ సాధన [02:10.35] ప్రయత్నమే మొదటి విజయం [02:15.43] ప్రయత్నమే మన ఆయుధం [02:20.36] ప్రయత్నమే మొదటి విజయం [02:25.40] ప్రయత్నమే మన ఆయుధం [02:30.69] ఓ' ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే [02:37.75] మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే [02:45.78]