|
ఘల్ ఘల్… ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్... |
|
ఘల్ ఘల్… ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్... |
|
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే |
|
ఆరాటం తీరేలా బదులిచ్చేగగనం లా పిలిపించే తడిగానం ప్రేమంటే |
|
అణువణువును మీటె మమతల మౌనం పదపదమంటే నిలువదు ప్రాణం |
|
ఆపరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు |
|
చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే |
|
మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి |
|
ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ||ఘల్ ఘల్……ఘల్ ఘల్|| |
|
చరణం 1 |
|
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో |
|
గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో |
|
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా |
|
ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే ఆ మాటకి తెలిసేనా |
|
ప్రేమంటే అది చరితను సైతం చదవనివైనం కవితను సైతం |
|
పలకని భావం సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటె |
|
దరిదాటి ఉరకలు వేసె ఏ నదికైనా తెలిసిందా తనలో |
|
ఈ ఒరవడి పెంచిన తొలి చినదేదంటే చిరిపైరై ఎగిరే |
|
వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు |
|
తొలి పిలుపేదంటే ||ఘల్ ఘల్ ……. ఘల్ ఘల్|| |
|
చరణం: 2 |
|
మండే కొలిమినడగందే తెలియదే మన్నుకాదు |
|
ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే |
|
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా |
|
విరబూసే గాయాలే వరమాలై దరిజేరె ప్రియురాలే గెలుపంటె |
|
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు |
|
తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే |
|
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జతవుంటే |
|
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా |
|
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతె |
|
నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా ||ఘల్ ….ఘల్ ఘల్|| |