|
నమ్మవేమో గాని, అందాల యువరాణి, |
|
నేలపై వాలింది, నా ముందే విరిసింది. |
|
నమ్మవేమో గాని, అందాల యువరాణి, |
|
నేలపై వాలింది, నా ముందే విరిసింది. |
|
అందుకే అమాంతం నా మది, అక్కడే నిశబ్దం అయినది. |
|
ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే నాతో ఉంది. |
|
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, |
|
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. |
|
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, |
|
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. |
|
నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే, |
|
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే. |
|
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, |
|
రూపం ఈడు భారాలై ముందర నిల్చుంటే. |
|
ఆ సోయగాన్నే నే చూడగానే, ఓ రాయిలాగా అయ్యాను నేనే. |
|
అడిగా పాదముని అడుగువేయమని కదలలేదు తెలుసా. |
|
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, |
|
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. |
|
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, |
|
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. |
|
వేకువ లోన ఆకాశం ఆమెను చేరింది, |
|
ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది. |
|
వేసవి తాపం చలి వేసి ఆమెను వేడింది, |
|
శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది. |
|
ఆ అందమంతా నా సొంతమైతే, ఆనందమైనా వందేళ్ళు నావే. |
|
కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిమి. |
|
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, |
|
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. |