|
Oneway oneway జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది |
|
తెలియదు అన్నా ఆగదే మరి సాగిపోయే ప్రయాణం |
|
Runway లాటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది |
|
ఎగుడు దిగుడు చూసుకోనిది పరుగు తీసే ప్రవాహం |
|
ఈ దారిలోన నవ్వు చిలకరించే మల్లె పూవులెన్నో |
|
తీయ తీయగానె నిన్ను గాయపరిచే తేనెటీగలెన్నో |
|
ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం |
|
అంతు తేలని సృష్టిలో రహస్యం |
|
జగమే ఒక మాయ బతుకే ఒక మాయ |
|
అది అన్నది ఎవరో అది విన్నది ఎవరో |
|
మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా |
|
ఒక్క చూపుకై బతికే ఆ మాయలో హాయిలేగా |
|
ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ mysteryకి |
|
బదులు ఎవ్వరూ చెప్పలేరుగా అందుకే నేటి రోజే నీది |
|
ఎంత చిన్నదో తెలుసుకో జీవితం |
|
అంతకన్న అతి చిన్నదీ యవ్వనం |
|
తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు |
|
తను వెళ్ళే చోటే తెలుసా మరి మనకు |
|
నిన్న అన్నదిక రాదు గతమంటె ఎందుకా మోజు |
|
రేపు అన్న ఆ రోజు కలలాంటిదే కదా మనకు |
|
ఎన్ని వేల చిరు వేషాలో కలిపి మనిషి అవతారం |
|
కళ్ళు మూసి తెరిచేలోగా మారిపోతుంది నాటక రంగం |
|
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం |
|
తెలుసుకుంటె నీ సొంతమే సమస్తం |