సర్వునినేత్ర ప్రభవజ్వాలలో విస్ఫులింగమై పొరలిన మువ్వలా వెల్లివెరియు వాహినిలోకి వల్లరి వీడి చలించు విరిలా హృదయం చెదిరి చెదిరి కలలే కదలి వదలి పోయెనే ఏలో ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా ఏలో ఏలో నాతో తెలిపేనా హృదయం అలసి సొలసి దిశలు మరిచిపోయేలో ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా పూతను మరిచెను తోపు నవ్వులు మరిచెను మెరుపు రాకను మరిచెను రేపు సృష్టిని మరిచెను ప్రేగు పూతను మరిచెను తోపు నవ్వులు మరిచెను మెరుపు రాకను మరిచెను రేపు నేనా నిన్ను మరువనే మరువనే మరువనే హృదయం చెదిరి చెదిరి కలలే కదలి వదలి పోయెనే ఏలో ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా ఏలో ఏలో నాతో తెలిపేనా పూలను వీడెను వర్ణం కడలిని వీడెను కెరటం నింగిని వీడెను మేఘం వాక్కును వీడెను అర్ధం పూలను వీడెను వర్ణం కడలిని వీడెను కెరటం నింగిని వీడెను మేఘం నేనా నిన్ను వీడనే వీడనే వీడనే నేనా నిన్ను వీడనే వీడనే వీడనే చిరు వేరు పెనుభారం మోయు తీరు చిన్నది జీవితమే ఆనంతమీ ప్రేమే