[00:03.95] చేసేదేదో చేసేముందే ఆలోచిస్తే తప్పుందా [00:13.60] తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా [00:22.42] ఆచి తూచి అడుగెయ్యొద్దా [00:25.35] [00:35.22] ఈతే తెలియాలి నది ఎదురైతే [00:39.95] పూర్తయి తీరాలి కథ మొదలెడితే [00:44.62] గెలుపే పొందాలి తగువుకి దిగితే [00:49.46] పడినా లేవాలి [00:52.80] ఏ పూటైనా ఏ చోటైనా [00:58.19] నిలవని పయనం సాగాలి [01:02.95] రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా [01:07.98] దారేదైనా గాని కోరే గమ్యం చూపించాలి [01:13.69] పక్క పక్కనే అక్షరాలను నిలిపివుంచినా [01:18.35] అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా [01:23.34] నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా [01:31.61] [01:38.54] స్పష్టంగా పోల్చుకో [01:40.94] శక్తుందా తేల్చుకో [01:42.74] అతి సులువుగా అయ్యే పనా ఏమనుకున్నా ఓహో [01:48.28] కష్టాలే ఓర్చుకో [01:50.44] ఇష్టంగా మార్చుకో [01:52.41] అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా ఒహో [01:57.87] కలలకి, కళ్ళకి మధ్యన కనురెప్పే అడ్డని [02:02.72] నమ్మకం నిజమయే లోపుగా తప్పని నొప్పి ఉందని [02:07.62] ఆటనే వేటగా మార్చడం కాలం అలవాటని [02:12.54] గమనించే తెలివుంటే ప్రళయాన్నే ప్రణయం అనవా [02:19.77] పక్క పక్కనే అక్షరాలను నిలిపివుంచినా [02:24.57] అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా [02:29.59] నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా [02:36.26] [03:08.88] శ్రీరాముని బాణమై సాధించిన శౌర్యమే [03:13.32] ఛేదించదా నీ లక్ష్యము యముడెదురైనా ఓహో [03:18.82] కృష్ణుని సారధ్యమై సాగిన సామర్ధ్యమే [03:23.18] సాధించదా ఘనవిజయము ప్రతి సమరానా ఓహో [03:28.68] కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి [03:33.50] గాలిలో కత్తులే దుయ్యకు శత్రువు లేని దాడికి [03:38.30] ఊహతో నిచ్చెనే వెయ్యకు అందని గగనానికి [03:43.16] వ్యర్ధంగా వదిలేస్తే వందేళ్ళు ఎందుకు మనకి [03:50.53] పక్క పక్కనే అక్షరాలను నిలిపివుంచినా [03:55.16] అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా [03:59.72] నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా [04:06.25]