నేస్తం...నేస్తం... నేస్తం... కలలు కన్నీళ్ళు కోట్లాది ఆశలు శిలలు శిల్పాలు మాట్లాడు భాషలు అన్నింట తనే ప్రాణం ఆ ప్రాణ స్వరం మౌనం ఆ.......ఆ..........ఆ... స్పందించే హృదయాలు అందించే చప్పట్లు ఆ శబ్దంలోనే వుంది అంతేలేని సంతోషం హర్షించే అధరాలు వర్షించే దీవెనలు ఆ మంత్రంలోనే వుంది అవధే లేని ఆనందం ఆనందం వురకలు వేస్తే గానం ఆవేదన మనసును మూస్తే మౌనం వింటున్నావా నేస్తం మౌన సంగీతం వింటున్నావా నేస్తం నా మౌన సంగీతం వింటున్నావా నేస్తం మౌన సంగీతం వింటున్నావా నేస్తం నా మౌన సంగీతం నేస్తం... ఆ..ఆ...ఆ.ఆ.. ·· సంగీతం ·· భూమి గగనంతో ఆడేను వూసులు బ్రతుకు మరణంతో చేసేను భాషలు అన్నింటికిది మూలం అనాది కథే మౌనం ఆనందం వురకలు వేస్తే గానం ఆవేదన మనసును మూస్తే మౌనం వింటున్నావా నేస్తం మౌన సంగీతం వింటున్నావా నేస్తం నా మౌన సంగీతం వింటున్నావా నేస్తం మౌన సంగీతం వింటున్నావా నేస్తం నా మౌన సంగీతం నేస్తం...